కువైట్, ఇండియా మంత్రుల మధ్య టెలిఫోనిక్ చర్చలు

- January 23, 2022 , by Maagulf
కువైట్, ఇండియా మంత్రుల మధ్య టెలిఫోనిక్ చర్చలు

కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం కువైట్ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాసర్ మహమ్మద్ అల్ సబాతో టెలిఫోనిక్ చర్చలు జరిపారు. భారత్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో భారతదేశం, కువైట్ మధ్య జాయింట్ కమిషన్ ముందస్తు సమావేశానికి రెండు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా, గల్ఫ్ నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇండో-పసిఫిక్ వరకు ప్రాంతీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ జైశంకర్ తన అధికారిక హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com