కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన.. 900 మందిపై ప్రాసిక్యూషన్‌

- January 24, 2022 , by Maagulf
కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన.. 900 మందిపై ప్రాసిక్యూషన్‌

 

ఖతార్: కోవిడ్-19 ముందుజాగ్రత్త చర్యల ఉల్లంఘనలకు సంబంధించి 967 మందిని ప్రాసిక్యూషన్‌కు రెఫర్ చేశారు. మాస్క్ లు ధరించనందుకు 697 మంది, సురక్షితమైన భౌతిక దూరం పాటించనందుకు 248 మంది, ఎహ్తెరాజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనందుకు 22 మందిపై కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 పరిమితులపై కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నారు. సిటిజెన్స్, రెసిడెంట్స్ అందరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. అంటు వ్యాధులకు సంబంధించి 1990 నాటి చట్టం నం. 17 ఆధారంగా కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా,  కోవిడ్-19 నివారణ, అమలులో ఉన్న ముందుజాగ్రత్త చర్యలను ఉల్లంఘించినందుకు అధికారులు అనేక మందిని ప్రాసిక్యూషన్‌కు పంపారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com