త్వరలో ఈ-పాస్ పోర్ట్ విధానం:మంత్రి నిర్మల
- February 01, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో అతి త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్ట్ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరుల సౌకర్యం కోసం 2022-23లో ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఈ-పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లు
- సురక్షితమైన బయోమెట్రిక్ డేటా
- ప్రపంచవ్యాప్తంగా సులభతర ఇమ్మిగ్రేషన్ పాసేజ్
- చిప్ ట్యాంపర్ చేయబడితే.. పాస్ పోర్టు అథంటికేషన్ ఫెయిల్ అవుతుంది.
- ఎంబెడెడ్ చిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్ ను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో తయారు చేస్తారు.
అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్‌పోర్ట్ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ డిజిటల్ పాస్‌పోర్ట్ రూపుదిద్దుకుంది.అలాగే ఈ-పాస్‌పోర్ట్ విధానం వల్ల నకిలీలను అరికట్టవచ్చు.ఈ కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కావున నకిలీ పాస్‌పోర్ట్‌లు వాడే వారిని నిలువరించే వీలు కలుగుతుంది.ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై చేసేందుకు పాస్‌పోర్ట్‌లోని మైక్రో చిప్ చాలా ఉపయోగపడుతుంది.దీని ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







