దశ, దిశ లేని బడ్జెట్ ఇది: తెలంగాణ సీఎం కెసిఆర్
- February 01, 2022
హైదరాబాద్ : నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇదో గోల్ మాల్ బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందన్నారు. ఇది పసలేని పనికిమాలిన బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ దిశా నిర్దేశం లేని బడ్జెట్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం మాటల గారడీలా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం విచిత్రమన్నారు. పన్నుచెల్లింపుదారుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు.”దశ-దిశ లేని బడ్జెట్ ఇది. నిరాశ నిస్పృహల బడ్జెట్. పసలేని, పనికిమాలిన బడ్జెట్. అన్ని వర్గాల వారిని నిరాశపర్చింది. కేంద్రమంత్రి ప్రసంగం మొత్తం డొల్ల కేంద్రం విమర్శించారు. జబ్బలు చరుచుకోవడం తప్ప ఏమీ లేదు’ అని కేసీఆర్ అన్నారు
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







