బ్రెజిల్ లో మెరుపు వరదలు…78 మంది మృతి
- February 17, 2022
బ్రెజిల్ లో సంభవించిన మెరుపు వరదల్లో 78 మంది దుర్మరణం చెందారు.భారీవర్షాల వల్ల బ్రెజిల్ దేశంలోని పెట్రోపోలిస్ నగరంలోని వీధులు నదులుగా మారాయి. వరదనీటి ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావం వల్ల రియో డి జనీరోకు ఉత్తరాన ఉన్న హిల్స్ లోని సుందరమైన పట్టణంపై వరదనీరు వెల్లువెత్తింది. వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి వారికి ఆహారం, నీరు, దుస్తులు, ఫేస్ మాస్కులు ఇచ్చారు.భారీ వరదల్లో నగరంలోని కార్లు, చెట్లు కొట్టుకుపోయాయి.
బ్రెజిల్ లోని పెట్రోపోలిస్ నగరంలో కేవలం మూడు గంటల్లో 258 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మేయర్ కార్యాలయం తెలిపింది.డిసెంబరు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది.గత నెలలో కుండపోత వర్షం, వరదల వల్ల కొండచరియలు విరిగిపడటంతో ఆగ్నేయ బ్రెజిల్‌లో 28 మంది మరణించారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







