గోధుమ కలాకండ్
- March 30, 2016
కావలసినవి: గోధుమ రవ్వ ఒక కప్పు, పాలు 5 కప్పులు, గోధుమ పిండి అర కప్పు, చక్కెర అర కప్పు, కండెన్డ్స్ మిల్క్ పావు కప్పు, యాలకులు 4 టేబుల్ స్పూన్లు. అలంకరించడానికి: రోజ్ సిరప్/సాస్ పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ తగినంత
ఎలా చేయాలి
గోధుమ రవ్వని ఒక కప్పు నీళ్లలో పది నిమిషాల పాటు నానబెట్టాలి. పాలను వేడి చేసి వాటిలో గోధుమ రవ్వ, చక్కెర, యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. కండెన్డ్స్ మిల్క్ కూడా పోసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి దగ్గరపడే వరకు మీడియం మంట మీద ఉడికించాలి. చల్లారాక ఒక ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని కావలసిన విధంగా అమర్చి దాని పక్కన రోజ్ సిరప్ లేదా సాస్‌ని వేయాలి. డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించాలి. ఇదే స్వీట్‌ని సగ్గుబియ్యంతోనూ, సేమ్యాతోనూ, వరిపిండితోనూ కూడా చేసుకోవచ్చు. అలాగే రోజ్ సాస్ బదులు పైనాపిల్ కారమిల్ సాస్‌లు కూడా వాడొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







