గౌతమ్, సితారతో ఎంజాయ్ చేస్తున్న నమ్రత
- March 30, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకీ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అప్పట్లోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి 'మురారి' చిత్రంతో తన నటనా విశ్వరూపం చూపించి..పోకిరి చిత్రంతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. గత సంవత్సరం రిలీజ్ అయిన 'శ్రీమంతుడు' చిత్రంతో ప్రజల్లో మంచి సోషల్ అవైర్ నెస్ తీసుకువచ్చారు. ఈ చిత్రంతో మహేష్ బాబు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన నమ్రత శిరోడ్కర్ తో ప్రేమ వివాహం జరిగింది..వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు.తాజాగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో తెగ బిజీ గా ఉంటే మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకొని గోవా బీచ్ లో హంగామా చేశారు. అసలే ఇక్కడ ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు..వేసవి సెలవులు రావడంతో ఇద్దరు పిల్లలు గౌతమ్ , సితార లను తీసుకొని వెళ్లి గోవా బీచ్ లో వాళ్లతో ఆడుకుంటూ సేద తీరింది నమ్రత .గౌతమ్, సితారతో ఎంజాయ్ చేస్తున్న నమ్రతమహేష్ బాబు ఇద్దరు పిల్లలు గౌతమ్ ,సితార లు గోవా బీచ్ అందాలను ఆస్వాదిస్తూ బాగానే ఎంజాయ్ చేసారు . గోవా బీచ్ లో గౌతమ్ ,సితార ల తో తను చేసిన సందడి ని కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమ్రత. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







