కువైట్ ప్రభుత్వ కార్యాలయాల్లో 100% హాజరు
- March 12, 2022
కువైట్: ఆదివారం నుండి అన్ని ప్రభుత్వ ఏజెన్సీలలో 100 శాతం హాజరుతో సిబ్బంది హాజరు కావాలని సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. కరోనా అదుపులోకి రావడంతో మినహాయింపులను రద్దు చేసినట్లు తెలిపింది. ఉద్యోగి హాజరు కాకపోతే సెలవుగా పరిగణిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ఉద్యోగులకు కల్పించిన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్, రొటేషన్ సిస్టమ్‌ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. అధికారిక అన్ని కార్యాలయాలు 100 శాతం వర్క్ ఫోర్స్ తో పనిచేయాలని తన ఉత్తర్వుల్లో సివిల్ సర్వీస్ విభాగం పేర్కొంది. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును సైతం తిరిగి ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







