బిగ్ బాస్ నాన్ స్టాప్: ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరంటే ?
- March 12, 2022
హైదరాబాద్: బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర్మ, శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే స్మగ్లర్ల టాస్క్‌లో బాగా రాణించిన ఈ ఇద్దరికీ ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని చెప్పాలి.
అఖిల్ టాప్ ప్లేస్ లో ఉంటే అరియానా మాత్రం అఖిల్ కి గట్టి పోటీ ఇస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. యాంకర్ శివ కూడా వీరిద్దరికీ మంచి ఫైట్ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న శివకు మంచి ఓటింగ్ శాతం వస్తోంది. బిందుమాధవితో ఉన్న స్నేహం కారణంగా బిందుమాధవి అభిమానుల ఓట్లు కూడా అతనికి ఎక్కువగా వస్తున్నాయి. మరోవైపు షణ్ముక్ జస్వంత్ ఫాలోవర్స్ కూడా యాంకర్ శివకే ఓటు వేస్తున్నారు. దీంతో యాంకర్ శివ సేఫ్ జోన్లో ఉన్నాడు. శ్రీరాపాక, మిత్ర శర్మ డేంజర్ జోన్ లో ఉండగా… ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







