దుబాయ్ ఎక్స్పో: అభిమానులతో సందడి చేయనున్న RRR టీం
- March 18, 2022
దుబాయ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'.దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ భారీగా అంచనాలను పెంచాయి.ఇప్పుడు సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్లో జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే మేకర్స్ మార్చి 18న 'ఆర్ఆర్ఆర్' మూవీ స్పెషల్ గ్రాండ్ ఈవెంట్‌ను దుబాయ్ ఎక్స్పో 2020లో నిర్వహించబోతున్నారు.సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకను ఘనంగా జరగబోతోంది.కాగా,ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్దమైనట్టు తెలుస్తుంది.అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలకి చెందిన పలువురు సెలబ్రిటీస్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్టు సమాచారం.ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.అలాగే.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్‌గా అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
See you tomorrow, #Dubai!! 4:30 PM local time. #RRRTakeOver #RRRMovie@Pharsfilm @indiaexpo2020 #indiapavilion #indiaatDubaiExpo pic.twitter.com/l3e2z5rQNv
— RRR Movie (@RRRMovie) March 17, 2022
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







