అజ్మాన్‌లో అగ్నిప్రమాదం...10 ట్రక్కులు దగ్ధం
- March 18, 2022
యూఏఈ: అజ్మాన్‌లోని అల్ జుర్ఫ్ ఇండస్ట్రియల్ ఏరియా 2లోని రెండు డీజిల్ కంపెనీలకు చెందిన వాహనాల్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.సమాచారం అందుకన్న అజ్మాన్ సివిల్ డిఫెన్స్ బృందాలు..అజ్మాన్ పోలీసుల సహకారంతో మంటను ఆర్పివేశాయి.ఈ ప్రమాదంలో ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగలేదు. కానీ 10 డీజిల్ ట్రక్కులు, ట్రైలర్‌లు దగ్ధమయ్యాయి.అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ రేద్ ఒబైద్ అల్ జాబీ మాట్లాడుతూ.. అజ్మాన్ పోలీసుల సహకారంతో అడ్మినిస్ట్రేషన్ సెంటర్ అండ్ అల్ జార్ఫ్ సెంటర్‌కు చెందిన అగ్నిమాపక బృందాలు మంటలు వ్యాపించకుండా సకాలంలో మంటలను అదుపు చేశాయన్నారు. అర్ధరాత్రి దాటిన ప్రమాదం జరిగిందని, కేవలం ఒక గంటలోపు మంటలను పూర్తిగా నియంత్రించామన్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని అల్-జాబీ తెలిపారు.అగ్నిమాపక నిరోధక పరిస్థితులకు కట్టుబడి, అన్ని అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







