గన్నవరం నుండి బెంగళూరు కి నూతన సర్వీస్ ప్రారంభం
- April 01, 2016
ప్రయాణికులకు మెరుగైన సేవలందించి వారి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధిని సాధించాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు అన్నారు. ఎయిరిండియా విమానయాన సంస్ధ నూతనంగా బెంగళూరు నుంచి గన్నవరంకు సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళేందుకు తొలి టికెట్‌ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నడుస్తున్న మూడు సర్వీసులు ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్‌లకు ప్రయాణికుల ఆదరణ నోచుకున్నాయని చెప్పారు. ఈ నాల్గవ సర్వీసు కూడా అలానే నడపాలని కోరారు. ఎయిరిండియా స్టేషన మేనేజర్ ఎం.రామసుబ్రహ్మణ్యన మాట్లాడుతూ బెంగుళూరు నుంచి 32 మంది ప్రయాణికులు వచ్చారని, ఇక్కడ నుంచి 11 మంది వెళ్ళారని వివరించారు. సీట్ల 42 ఉన్నాయన్నారు. ప్రయాణికుల అభిరుచి మేరకు సర్వీసులను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి మరో అదనపు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎయిరిండియా ఎయిర్‌పోర్టు మేనేజర్ డి.రజని, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







