ఏప్రిల్ 2 నుంచి Ramadan నెల ప్రారంభం
- March 19, 2022
యుఎఇ: Ramadan ఏప్రిల్ 2న ప్రారంభమవుతుందని, 30 రోజుల పాటు కొనసాగుతుందని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ తెలిపింది. ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ మాట్లాడుతూ.. పవిత్ర రమదాన్ నెల ఏప్రిల్ 2, శనివారం ప్రారంభమవుతుందన్నారు. ఈద్ అల్-ఫితర్ సోమవారం, మే 2 రమదాన్ 1433 హిజ్రీ సంవత్సరంలో వస్తుంది. 30 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. షార్జా ఎమిరేట్‌లోని ఖోర్ ఫక్కన్ నగరంలోఉపవాసం, అల్పాహారం ప్రారంభ సమయం రాజధాని అబుదాబి కంటే ఎనిమిది నిమిషాల ముందు ఉంటుంది. అల్ ఘువైఫత్, అల్ సిలా, దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో ఉపవాసం, అల్పాహారం రాజధాని కంటే సుమారు 12 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఖోర్ ఫక్కన్‌లో ప్రార్థన తెల్లవారుజామున 04:48, రాజధాని అబుదాబిలో 04:56, అల్ సిలా, ఘువైఫత్‌లలో 05:08 అని అల్ జర్వాన్ తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







