మంత్రి కేటీఆర్ కు అమెరికాలో ఘనస్వాగతం..
- March 20, 2022
అమెరికా: తెలంగాణ మంత్రి కే.తారకరామారావు కి అమెరికాలో ఘనస్వాగతం లభించింది.తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో మంత్రి కే.తారకరామారావు పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు. మంత్రి కేటీఆర్ లాస్ ఏంజిల్స్ లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో కాసేపు ముచ్చటించారు.
తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







