హైదరాబాద్: బ్లాక్ స్టిక్కర్స్ పై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
- March 20, 2022
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న వరుస కారు ప్రమాదాలపై నగర వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో..ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈక్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన నేపథ్యంలో బ్లాక్ స్టిక్కర్స్ తో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్స్ తో పాటు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్, బంజారాహిల్స్, జూబిలీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లోవాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పోలీసులు.
జూబిలీహిల్స్ పరిధిలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బ్లాక్ ఫిల్మ్ తో తిరుగుతున్న వాహనాలని తనిఖీ చేసిన పోలీసులు ఫిల్మ్ లను తొలగిస్తున్నారు. నిబంధనలు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడకంపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద 180 కేసులు నమోదు చేశారు. బ్లాక్ ఫిలిం తొలగించడంపై కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
బ్లాక్ ఫిల్మ్, స్పెషల్ స్టిక్కర్స్ ఉన్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సిఐ ముత్తు 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాహనదారులు కచ్చితంగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని సీఐ ముత్తు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వారాల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో ఎమ్మెల్యే స్టిక్కర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ముత్తు తెలిపారు. ఇందులో నాంపల్లి ఎమ్మెల్యే మేరజ్ హుసేన్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్టిక్కర్ స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. డేట్ ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్స్ ను వారి స్నేహితులు కార్లకు అతుకించుకొనితిరుగుతున్నారని ఇలా చేయడం కరెక్ట్ కాదని ట్రాఫిక్ సీఐ ముత్తు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







