ఫెడరల్ సుప్రీంకోర్టును సందర్శించిన భారత బృందం

- March 20, 2022 , by Maagulf
ఫెడరల్ సుప్రీంకోర్టును సందర్శించిన భారత బృందం

అబుధాబి: భారత రాయబారి సంజయ్ సుధీర్‌తో పాటు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని భారత సుప్రీంకోర్టు ప్రతినిధి బృందానికి ఫెడరల్ సుప్రీంకోర్టు అధ్యక్షుడు మహమ్మద్ హమద్ అల్ బాడి స్వాగతం పలికారు. అనంతరం భారతీయ న్యాయ ప్రతినిధి బృందం ఫెడరల్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పర్యటించారు. అక్కడ వారు అధునాతన వ్యవస్థలతో అమర్చబడిన కోర్టు గదులను సందర్శించారు. చట్టపరమైన, న్యాయ విధానాల గురించి ప్రతినిధి బృందం అడిగి తెలుసుకున్నారు. UAE-భారత్ మధ్య బలమైన స్నేహం, సహకార సంబంధాలు ఈ పర్యటనతో మరింత మెరుగయ్యాయని అల్ బాడీ చెప్పారు. ఈసందర్భంగా స్మార్ట్ లిటిగేషన్, ఆటోమేషన్ వైపు ఫెడరల్ సుప్రీంకోర్టు చేపట్టిన సంస్కరణల గురించి భారతీయ న్యాయ ప్రతినిధి బృందానికి అల్ బాడీ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com