దుబాయ్ కెన్.. తగ్గిన ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం
- March 24, 2022
యూఏఈ: 'దుబాయ్ కెన్' చొరవతో 234,000 కంటే ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం తగ్గింది. ఫిబ్రవరి 15న ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు సిటిజెన్స్/రెసిడెంట్స్, పర్యాటకులు దుబాయ్ కెన్ వాటర్ ఫౌంటైన్ల నుండి 117,000 లీటర్లకు పైగా నీటిని ఉచితంగా వినియోగించుకున్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా ఐదు కొత్త వాటర్ ఫౌంటెన్లను ఆవిష్కరించారు. వీటితో కలిపి నగరంలో మొత్తం ‘దుబాయ్ కెన్’ వాటర్ ఫౌంటైన్ల సంఖ్యను 39కి చేరింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించిన ఈ కార్యక్రమం UAE లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గిస్తోంది. రీఫిల్ చేయగల బాటిళ్ల వినియోగం, ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్లను ఇన్స్టాల్ చేయడం వంటి చర్యలను చేపట్టేలా ‘దుబాయ్ కెన్’ ప్రోత్సహిస్తుంది. దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ (DET) టూరిజం డెవలప్మెంట్ & ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూసుఫ్ లూటా మాట్లాడుతూ.. డిసెంబర్ 2022 నాటికి నగరం అంతటా 50 దుబాయ్ ఫౌంటైన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దుబాయ్ క్యాన్ బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ Noon.comలో 36.75 దిర్హాలకు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్‌లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







