193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ..

- April 03, 2016 , by Maagulf
193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ..

 రైల్వేమంత్రిత్వశాఖ ప్రతిరోజు లక్ష మందికి ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ కాటరింగ్ విధానం ద్వారా రైళ్లలోనూ ప్రయాణికులకు నచ్చే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసలుబాటు కల్పించనుంది. ఈ క్యాంటీన్ విధానంతో ప్రయాణికుల భోజన సమస్యలకు చెక్ పెట్టాలని గతంలోనే నిర్ణయించారు. ప్రతిరోజూ దాదాపు లక్ష భోజనాల వరకు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. 2014లో కొన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పించినా ప్రయాణికులకు అవసరాల దృష్ట్యా మరిన్ని సేవలను అందించాలని ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ క్యాంటిన్ విస్తరణను మొదలుపెట్టారు.ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ఎస్ఎంఎస్ పద్ధతులలో తమ ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు. హల్దిరామ్స్, డోమినాస్ పిజ్జా, బికనిర్ వాలా, వింపి, ఇతర సంస్థలతో ఈ మేరకు రైల్వేశాఖ ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com