ఆలోచనా స్రవంతి

అక్షరాంకిత విలసితమగును జగతి
ప్రణవ సంభూత నాదసంపర్క సార
విభ్రమాద్భుత వేద సంవేద్యమద్ది
సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.

"యత్ర నార్యంతు పూజ్యంతే", యనెడు సూక్తి
వినగలేదా సమున్నత ప్రేమమీర
ఆదుకొను మక్కచెల్లెళ్ళ నాదరమున
సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.

 

--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు 

Back to Top