150 కోట్ల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్..

- April 03, 2016 , by Maagulf
150 కోట్ల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్..

సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీ 200 వందల కోట్ల రూపాయల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ దాదాపు 90 కోట్ల రూపాయలుగా పైగా బిజినెస్ ని చేసుకుంది. ఇక 40 దేశాలలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, కచ్ఛితంగా కలెక్షన్స్ అనేది 150 నుండి 200 కోట్ల రూపాయలలో ఉంటుందని అంటున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి ఈసారి కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలీవుడ్ థియోటర్స్ కలిసొచ్చే అంశంగా ఉంది. దీంతో సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, ఇతర 40 వరకూ ఉన్న దేశాలు, అలాగే బాలీవుడ్ మార్కెట్. వీటన్నింటిని కలిపి ఈ మూవీ మినిమం 150 కోట్ల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.అయితే ఇదంతా మూవీ బాగుంటేనే సాధ్యం. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా కచ్ఛితంగా 100 కోట్లకి మించిన కలెక్షన్స్ కేవలం 3 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బ్లాక్ బస్టర్ అనే టాక్స్ వస్తే మాత్రం ఈ మూవీ దాదాపు 150 కోట్లకి మించిన కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అంటున్నారు. దీంతో సర్ధార్ గబ్బర్ సింగ్ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం 150 కోట్ల రూపాయలను టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com