ఎం-వాలెట్ యాప్ అందుబాటులోకి
- April 03, 2016
ఫోన్లోనే వాహన చోదక, రిజిస్ట్రేషన్ పత్రాలు.. హైదరాబాద్: ప్రయాణ సమయంలో వాహనం రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం(ఆర్సీ), చోదక అనుమతి (డ్రైవింగ్ లైసెన్స్) వంటి పత్రాలను ఫోన్లో డిజిటల్ రూపంలో చూపించే వెసులుబాటును వాహనచోదకులకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికోసం మొబైల్ వాలెట్ యాప్‌ను తీసుకురానుంది. ఫలితంగా వాహనదారులు ఆయా పత్రాలను ప్రతిసారీ వెంట పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు. తనిఖీ అధికారులు అడిగినప్పుడు సెల్ఫోన్లో యాప్‌ను తెరిచి డిజిటల్ పత్రాల్ని చూపిస్తే సరిపోతుంది.దీని కోసం రవాణాశాఖ తీసుకురానున్న ఎం-వాలెట్ యాప్‌ను ముందు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాహనం పత్రాలు, చోదక అనుమతి పత్రాల్ని యాప్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇటీవల ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో యాప్ తయారీ, వాహనదారులకు అందుబాటులోకి తేవడానికి కనీసం 3, 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ తర్వాత ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రవాణాశాఖలో వివిధరకాల సేవల్ని ఆన్లైన్లో పొందే అవకాశం కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇవి ఓ కొలిక్కి రాగానే ఎం-వాలెట్ సేవల్ని అందుబాటులోకి తెస్తామని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







