638 మంది డ్రగ్స్ అనుమానితులు అరెస్ట్
- April 09, 2022
కువైట్: 2022 మొదటి త్రైమాసికంలో 638 మంది డ్రగ్స్ అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మగ్లర్లు, డ్రగ్స్ పంపేవారిని ఎదుర్కోవడానికి ఇతర భద్రతా రంగాల సహకారంతో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది. ప్రత్యేక భద్రతా సంస్థల సమన్వయంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ ప్రమోటర్లు యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, డ్రగ్ పెడ్లర్లపై నిఘా పెట్టినట్టు పేర్కొంది. మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొనేందుకు పౌరులు, నివాసితులు భద్రతా సేవలతో సహకరించాలని భద్రతా వర్గాలు పిలుపునిచ్చాయి. అన్ని కుటుంబాలు తమ పిల్లలపై పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. పిల్లలో మతపరమైన నైతిక విలువలను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







