రహదారి భద్రతపై వీడియో షేర్ చేసిన అబుదాబి పోలీసులు
- April 09, 2022
అబుదాబి: రోడ్డుపై ప్రయాణించే క్రమంలో వాహనాలు ఆకస్మికంగా లేన్ మారడం వల్ల కలిగే ప్రమాదాలను తెలిపేందుకు అబుదాబి పోలీసులు ఓ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో రహదారి భద్రతపై జాగ్రత్తలను మరోసారి గుర్తు చేశారు. వాహనదారులు తమ వాహనాలను తిప్పడం లేదా అకస్మాత్తుగా దారులు మార్చడం వల్ల కలిగే ప్రమాదాలను పోలీసులు ఈ వీడియోలో చూపించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. వాహనదారులు నిర్దేశించిన లేన్ లోనే వెళ్లాలని, నిర్దేశించిన వేగంలోనే వాహనాన్ని నడపాలని అబుదాబి పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







