సౌదీ అరేబియాలోని గ్రాండ్ మస్జీదులో ఘర్షణ
- April 09, 2022
సౌదీ: పవిత్ర నగరం మక్కాలోని గ్రాండ్ మస్జీదు లోపల గురువారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌదీ అరేబియాలోని భద్రతా అధికారులు వెల్లడించారు. హజ్, ఉమ్రా భద్రత కోసం ప్రత్యేక దళాలు గ్రాండ్ మస్జీదు లోపల గొడవ జరిగిందని నిర్ధారించారు. ఇద్దరు వ్యక్తులు ఈ ఘర్షణలో పాల్గొన్నారని, ఎవరికి గాయాలు కాలేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక భద్రత దళాలు సంఘటన జరిగిన స్థలానికి చేరుకునేలోపే కొంతమంది యాత్రికులు వారి మధ్య వివాదాన్ని పరిష్కరించారన్నారు. అన్ని రకాల ప్రవేశ వీసాలు కలిగి ఉన్నవారు ఉమ్రా చేయడానికి అనుమతించబడతారని సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







