కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ
- April 15, 2022
న్యూఢిల్లీ: గుజరాత్ లోని భుజ్ జిల్లాలో ఏర్పాటు చేసిన కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రధాని నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. దేశంలో వచ్చే పదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు.
వైద్య విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని చెప్పారు. ఈ చర్యల ఫలితంగా రానున్న పదేళ్లలో భారీగా వైద్యులు సమకూరతారని తెలిపారు. అందుబాటు ధరలకే నాణ్యమైన వైద్యాన్ని భుజ్ ఆస్పత్రి అందించాలని సూచించారు. ‘‘20 ఏళ్ల కిందట గుజరాత్ లో 9 వైద్య కళాశాలలే ఉన్నాయి.వాటిలోని సీట్లు 1,100. నేడు 36 కళాశాలలు, 6,000 సీట్లకు పెరిగాయి’’అని ప్రధాని వివరించారు. 2001లో తీవ్ర భూకంపాన్ని తట్టుకుని నిలబడినట్టు గుర్తు చేశారు.వ్యాధులకే కాదని, సామాజిక న్యాయానికీ చికిత్స అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. పేదలు సైతం చౌకగా, చక్కటి వైద్యాన్ని పొందినప్పుడు వ్యవస్థపై వారికి నమ్మకం కలుగుతుందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







