NRI TDP విభాగం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు

- April 15, 2022 , by Maagulf
NRI TDP విభాగం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు

హైదరాబాద్:వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగాన్ని తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసింది.ఇందు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ http://www.nritdp.com ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో లాంచనంగా ప్రారంభించారు.ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్.ఆర్.ఐ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు.ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 1200 మంది కౌన్సిల్ మెంబర్స్ ని ఏర్పాటు చేయటంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ - ల్యాండ్ లైన్ +918645350888 వాట్సాప్ +918950674837 ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు, ఏపీలో ఐటి, టెక్నికల్ వంటి పలు ఉద్యోగ, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఈ విభాగం నిర్వహించనుంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రోసిజరల్ గైడ్ లైన్స్ ఇవ్వటంతోపాటు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఈ ఎన్.ఆర్.ఐ టిడిపి సెల్ పని చేస్తుంది.

ఈ సందర్బంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...యుద్ద సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించటంలో ఎన్.ఆర్.ఐ టిడిపి సెల్  చేసిన సేవలను కొనియాడారు. వివిధ దేశాల్లో టీడీపీ 40 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.విదేశాల్లో స్థిరపడ్డ టీడీపీ అభిమానులంతా ఈ వైబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డా.వేమూరు రవి కుమార్, రాజశేఖర్ చప్పిడి తో పాటుగా పార్టీ అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com