ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- June 23, 2026
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్(Andhra Pradesh Cabinet), రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక ఇంధన రంగాలకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక తీర్మానాలు చేసింది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫార్సు చేసిన దాదాపు రూ.34,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా 35,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.139 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పర్యవేక్షణ కోసం సీఆర్డీఏలో 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు అంగీకరించారు. అలాగే అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో అక్కడ ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ఉద్యోగులకు ఊరట–ఇంధన, పర్యాటక రంగాలు:
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేలా విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో భారీ పర్యాటక ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనమే లక్ష్యంగా అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు జరపడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని క్యాబినెట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







