ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ 'సెల్ఫిష్' ఘనంగా ప్రారంభం
- April 15, 2022
హైదరాబాద్: రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "సెల్ఫిష్" టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా...దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...*మా ఆశిష్ రౌడీ బాయ్ చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు. సుకుమార్ నేను ఆర్య సినిమాకు పనిచేశాం. ఇప్పుడంతా ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మళ్లీ ఇన్నేళ్లకు సెల్ఫిష్ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. సెల్ఫిష్ అనే ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. రౌడీ బాయ్స్ రిలీజ్ ముందు నుంచే ఈ కథ మీద వర్కవుట్ చేశాడు. పర్పెక్ట్ గా స్టోరీ సెట్ అయ్యింది. ఆశిష్ కు మొదటి సినిమా టైలర్ మేడ్ కానీ ఈ సినిమా అతనికి ఛాలెంజ్ లాంటిది. సెల్ఫిష్ తో ఆశిష్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్* అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - మణికందన్.ఎస్, సంగీతం - మిక్కీ జే మేయర్, ఆర్ట్ - యల్లయ్య. ఎస్, సాహిత్యం - చంద్రబోస్, సహ నిర్మాతలు - హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, నిర్మాణ సంస్థలు - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాతలు - రాజు , శిరీష్, రచన దర్శకత్వం - విశాల్ కాశీ.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







