ఎఫ్.3 చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం
- April 15, 2022
హైదరాబాద్: బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రం తర్వాత అంతకుమించి వుండేలా ఎఫ్3 ని రూపొందిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విశేషం ఏమంటే, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల లో ఒకరైన పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రత్యేకమైన పార్టీ సాంగ్ ద్వారా ఈరోజు షూట్‌లో జాయిన్ అయింది. నేటి నుంచే ఈ పాట చిత్రీకరణ మొదలైంది. అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో రూపొందిన అత్యద్భుతమైన సెట్‌లో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అనుగుణమైన, ఆకర్షణీయమైన ట్యూన్‌ను రూపొందించారు.. ఈ పార్టీ సాంగ్‌లో విశేషమేమిటంటే, పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణం అయిన వెంకటేష్, వరుణ్ తేజ్, హీరోయిన్లు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పూజా హెగ్డే స్పెషల్ డ్యాన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వీళ్లందరినీ కలిసి స్క్రీన్ పై చూడడం నిజంగా పండగే.ఎఫ్2లో నటించిన రాజేంద్రప్రసాద్ ఎఫ్3 లో భాగం కాగా, సునీల్ ఈ చిత్రానికి మరో ఎస్సెట్.
దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఎడిటర్ గా తమ్మిరాజు, సహ నిర్మాత గా హర్షిత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.F3 చిత్రం మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: అనిల్ రావిపూడి
సమర్పకుడు: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
DOP: సాయి శ్రీరామ్
కళ: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అదనపు స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







