నాని, వివేక్ ఆత్రేయ, అంటే సుందరానికి' ఏప్రిల్ 20న టీజర్ విడుదల
- April 18, 2022
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మొదటి పాట పంచెకట్టు సూపర్‌హిట్ కాగా, పోస్టర్లు, హోమం వీడియో స్పెషల్ బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఇప్పుడు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ డేట్ ని ప్రకటించడంతో పాటు మరో రెండు బ్రాండ్ న్యూ పోస్టర్‌లను విడుదల చేశారు.
ఈ పోస్టర్స్ లో హీరో, హీరోయిన్ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా వుంది. ఇందులో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి నటిస్తుండగా, నజ్రియా, లీలా థామస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో క్లాస్ అండ్ స్టైలిష్‌గా,మరో పోస్టర్ లో సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్, భాను
పీఆర్వో: వంశీ, శేఖర్
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









