వాహనం రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకపోతే SR100 జరిమానా
- May 02, 2022
రియాద్: వాహనం రిజిస్ట్రేషన్‌ను సకాలంలో పునరుద్ధరించకపోతే SR100 జరిమానా విధిస్తామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) వెల్లడించింది. వాహనం యొక్క రిజిస్ట్రేషన్ గడువు ముగిసినప్పటి నుండి 60 రోజులు గడిచినా పునరుద్ధరించని వాహనంపై ప్రతి సంవత్సరానికి SR100 జరిమానా విధించబడుతుందని మురూర్ స్పష్టం చేసింది. వాహనం రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ రుసుము SR100 కాగా, వాహన రకాన్ని బట్టి రుసుము పెరుగుతుందన్నారు. బస్సులకు SR400కి ఉందన్నారు. వాహనదారుడు తన వాహనం నంబర్ ప్లేట్ పోగొట్టుకున్నప్పుడు అనుసరించాల్సిన విధానాలను మురూర్ ఇంతకు ముందే వెల్లడించింది. కారు యజమాని తన నష్టాన్ని తక్షణమే క్రిమినల్ రికార్డ్స్ విభాగానికి నివేదించాలని పేర్కొంది. నష్టాన్ని నివేదించిన తర్వాత డూప్లికేట్ నంబర్ ప్లేట్ పొందేందుకు అవసరమైన రుసుము చెల్లించాలి. ఆపై వాహన యజమాని దరఖాస్తును సమీప ట్రాఫిక్ పోలీసుల కార్యాలయాలలో అందజేయాలి. సౌదీయేతర వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఉల్లంఘనలను ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తిస్తుందని మురూర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







