'మేజర్' థియేట్రికల్ ట్రైలర్ మే 9న విడుదల
- May 04, 2022
హైదరాబాద్: డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'మేజర్' ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో ని చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంది. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు వీడియో చూస్తే అర్ధమౌతుంది. రెండు భాషలలో విడివిడిగా చూపించిన సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా వున్నాయి. వార్, ఎటాక్, యాక్షన్, రోమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు.
26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







