ముంబయి పేలుళ్ల కేసు తీర్పు ఈరోజు వెల్లడైంది
- April 06, 2016
ముంబయిలో 2002-03లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక పోటా కోర్టు ప్రధాన నిందితుడు ముజామ్మిల్ అన్సారీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వాహిబ్ అన్సారీ, ఫర్హాన్ ఖోట్లకు కూడా జీవితఖైదు విధించింది. కేసులో మరో ముగ్గురు దోషులు సాఖిబ్ నచన్, అతీఫ్ ముల్లా, హసీబ్ ముల్లాలకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మార్చి 29న కోర్టు 13 మంది నిందితుల్లో 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆరుగురికి ఇవాళ శిక్ష ఖరారు చేయగా మిగిలిన నలుగురు ఇప్పటికే చాలాకాలం జైలులో గడిపినందున నియమాల ప్రకారం బెయిల్ పత్రాలు సమర్పిస్తే విడుదలచేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.2002 డిసెంబరు 6న, 2003 మార్చి 13న జరిగిన ముంబయి పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. 2003 జనవరి 27న పేలుడులో ఓ వ్యక్తి మరణించారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెల్లడైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







