పవన్ కళ్యాణ్ సినిమాలకి ముంచుకొస్తున్న ప్రమాదం.!
- May 11, 2022
రాజకీయాల్లో వేగం పెంచాలనే వుద్దేశ్యంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేకిచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ ఈ మధ్యనే సినిమాలపై ఫోకస్ పెట్టారాయన. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వచ్చిందే తడవుగా, వరుస పెట్టి సినిమాలను ఓకే చేసేశారు.
అలాగే, పూర్తయిన సినిమాల్ని పూర్తయినట్లే రిలీజ్ చేసేస్తున్నారు కూడా. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేశారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు. హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా రేపో మాపో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా వుంది.
అయితే, ఈ లోపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికల దిశగా అక్కడి రాజకీయ పరిస్థితులు జోరందుకుంటున్నాయ్. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాల పైనే పూర్తిగా ఫోకస్ పెడతారా.? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయ్.
తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలకు బ్రేకిస్తారంటూ ప్రచారం కూడా జోరందుకుంటోంది. అంతేకాదు, సెట్స్‌పై వున్న సినిమాలను సైతం మధ్యలోనే ఆపేస్తారట అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. అయితే, ఇదంతా ఉత్త ప్రచారమే.. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.. అంటూ పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రచారాలనేమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారట కూడా.
అవును నిజమే, ఆయన పవన్ కళ్యాణ్. ఇటు సినిమాలనూ, అటు రాజకీయాలనూ రెండింటినీ పక్కాగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







