వలసదారుల గ్రీన్ కార్డ్: సౌదీ ఆలోచన
- April 06, 2016
చమురు రంగం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది సౌదీ అరేబియా. వలసదారులు ఎక్కువగా ఉన్న తమ దేశంలో వారికి శాశ్వత నివాసం కల్పించడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్న కోణంలో చర్చలు జరుగుతున్నట్లు డిప్యటీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు. అమెరికాలో ఉండే గ్రీన్ కార్డ్ తరహాలో ఓ ప్రోగ్రామ్ గురించి ఆలోచన చేస్తున్నామన్నారు ఆయన. ఆదాయాన్ని పెంచుకునే ఇతర మార్గాల్లో భాగంగా వాల్యూ యాడెడ్ టాక్స్ మరియు ఎనర్జీ, షుగరీ డ్రింక్స్‌పై లెవీ, లగ్జరీ ఐటమ్స్ మీద లెవీ పన్నులు, సబ్సిడీ కోతలు తదితర అంశాలపై దృష్టిపెట్టామని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. దుబాయ్‌లో 10 మిలియన్ వలసదారులు ఉన్నారనీ, అధికారిక కోటాని మించి వలసదారుల్ని నియమించుకునేలా ఎంప్లాయర్స్‌కి అవకాశం కల్పిస్తే, ఏడాదికి 10 బిలియన్ల డాలర్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని అంచనా వేసినట్లు క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. గ్రీన్ కార్డ్‌తో 10 బిలియన్ డాలర్ల రెవెన్యూ అలాగే అదనంగా 10 బిలియన్ డాలర్ల రెవెన్యూ 2020 నాటికి వస్తే, అది ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







