3 నెలల్లో 375 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- April 06, 2016
రస్ అల్ ఖైమా పోలీసులు 375 టిక్కెట్లను ట్రాఫిక్ ఉల్లంఘించిన డ్రైవర్లకు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ కార్యక్రమం చేపట్టామని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ ఛీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నువామి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమం ఏప్రిల్ నెలాఖరుకు ముగుస్తుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ కల్నల్ అలీ సయీద్ అల్ అల్కీమ్ వివరించారు. మార్చలో 189 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జరీమానాలు విధించామని, ఫిబ్రవరిలో 136, అలాగే జనవరిలో 50 జరీమానాలు విధించామని ఆయన అన్నారు. సామాన్యులు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులకు సమాచారం అందించాలని కల్నల్ అల్కీమ్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







