ప్రేమలో పడ్డ ఐటెం బాంబ్: ఆ ముద్దుగుమ్మల బాటలోనే.!
- May 18, 2022
బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ప్రేమలో పడిందట. అదేంటీ. ఈ ముద్దుగుమ్మకి ఆల్రెడీ పెళ్లయిపోయిందేమో కదా.. అని కాస్త అటూ ఇటూ డౌటు కొడుతుందా.? అవునండీ రాఖీ సావంత్‌కి పెళ్లయ్యింది. కానీ, తన భర్తకు అంతకు ముందే పెళ్లయ్యి భార్య, కొడుకు వున్నాడన్న ఆరోపణతో విడాకులు తీసుకుంది ఈ అమ్మడు.
అంతేకాదు, ఆ మధ్య పలుసార్లు తన భర్త తనను వేధిస్తున్నాడనీ, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నాడంటూ పోలీసులనాశ్రయించింది కూడా. అయినా, రాఖీ సావంత్‌కి దూకుడు చాలా ఎక్కువ. నోరు అస్సలు మంచిది కాదు. ఆ నోటితో చాలా సార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న సంగతి చాలా మందికి తెలిసే వుంటుంది.
అది సరే, ఇప్పుడీ ఐటెం బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందట. అది కూడా వయసులో తనకన్నా ఆరేళ్ల చిన్నోడితో ప్రేమలో పడిందట. అబ్బో.! ఈ తరహా ప్రేమ కథలు చాలానే విన్నాం కదా అనుకుంటున్నారా.? అవునవును.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చో్ప్రా.. మరో బాలీవుడ్ హాట్ సెన్సేషన్ మలైకా అరోరా కూడా ఈ తరహా ప్రేమ కథలతోనే పాపులర్ అయ్యారు.
తన నోటి దూలతో కాస్తో కూస్తో పాపులారిటీ దక్కించుకున్నా, అది చాలదనుకుంటోందేమో రాఖీ సావంత్. ఇప్పుడిదిగో ఈ ముదురు, లేత ప్రేమ కహానీలతో పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటోంది. ఇంతకీ రాఖీ సావంత్ లేత ప్రేమికుడు సినిమాలకు సంబంధించిన వాడేనా.? అంటే కాదులెండి. ఓ బిజినెస్ పర్సన్. పేరు అదిల్ దురానీ.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







