బహ్రెయిన్ బ్యాంకింగ్ సేవల్లోకి స్పేర్ టెక్నాలజీ
- May 25, 2022
బహ్రెయిన్: కువైట్ ఆధారిత వ్యక్తిగత ఫైనాన్స్ అప్లికేషన్ స్పేర్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ నుండి ఓపెన్ బ్యాంకింగ్ లైసెన్స్ పొందింది. కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్‌లో ఓపెన్ బ్యాంకింగ్ అనుబంధ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేయడానికి స్పేర్ కు ఈ లైసెన్స్ అనుమతిస్తుంది. 2022 రెండవ త్రైమాసికంలో దేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించాలని స్పేర్ యోచిస్తోంది. స్పేర్ అప్లికేషన్ బహ్రెయిన్‌లోని అన్ని ప్రధాన బ్యాంకులతో అనుసంధానించబడుతుంది. వినియోగదారులను మల్టీ బ్యాంక్ ఖాతాలకు కనెక్ట్ చేయడానికి, బ్యాలెన్స్‌లను ట్రాక్ చేయడానికి, ఖర్చులను పర్యవేక్షించడానికి, బడ్జెట్‌లను సెట్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి సహాయంగా ఉంటుంది. దీనితో బహ్రెయిన్‌లోని కస్టమర్లకు వేగవంతమైన, చౌకైన, మరింత సురక్షితమైన చెల్లింపు పరిష్కారాలను అందిస్తుంది. వీటితో పాటుగా QR కోడ్‌లను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







