వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్..
- May 27, 2022
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ సొంత యాప్ వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సప్ మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా డిలీట్ చేసేయొచ్చు. చాట్ బాక్సులోకి వెళ్లి అనవసరమైన మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఒక నిర్దిష్ట సమయానికి అదే ఆటో డిలీట్ చేసేస్తుంది.వాట్సప్ చాట్స్‌కి, గ్రూప్స్ చాట్లోనూ ఈ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ అందుబాటులో ఉంది.ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల్లో ఒకటి ఎంచుకోవాలి. సరిగ్గా అదే సమయానికి ఆయా మెసేజ్‌లు డిలీట్ అయిపోతాయి.
అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ వన్ సైడ్ మాత్రమే వర్క్ అవుతోంది. అంటే.. మీ కాంటాక్ట్స్‌లోని ఎవరి చాట్ అయినా డిసప్పియరింగ్ మెసేజ్ ఎనేబుల్ చేస్తే.. వారు పంపే మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి. వారి చాట్స్‌లో లేదా మీ చాట్స్‌లో ఆయా మెసేజెస్ కనిపించవు. అలాంటి డిలీట్ మెసేజ్ సేవ్ చేసే అవకాశం లేదు. అందుకే వాట్సాప్ ఇప్పుడు ఆ ఫీచర్ తీసుకొస్తోంది.
మీరు కొన్ని మెసేజెస్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేసినా కూడా ఆ మెసేజ్ చాట్ బాక్సు నుంచి డిలీట్ అవుతుంది. కానీ, ఒక సపరేటు బాక్సులో ఆ మెసేజ్ స్టోర్ అవుతుంది. WABetaInfo ప్రకారం.. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేశాక చాట్స్లోని మెసేజ్ యూజర్లు సేవ్ చేసుకోవచ్చు అనమాట.. ఇప్పటికే వాట్సప్ బీటా యూజర్లు ఈ ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ‘Kept Messages’ పేరుతో కొత్తగా ఒక సెక్షన్ ప్రవేశపెట్టింది వాట్సాప్. ఆ సెక్షన్లో యూజర్ సేవ్ చేసిన మెసేజ్ లు స్టోర్ అవుతాయి.
ఆండ్రాయిడ్ యూజర్లకు, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ లేదు. ఈ ఫీచర్ ఉంటే.. కాంటాక్ట్స్‌కి, గ్రూప్స్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్వి నియోగించు కోవచ్చు. ఏ ఛాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేయాలో అదే చాట్ ముందుగా ఓపెన్ చేయాలి. ఆ కాంటాక్ట్ పై క్లిక్ చేయండి. మీకు Disappearing Messages డిఫాల్ట్‌గా డిజేబుల్ అయి ఉంటుంది. మీరు దాన్ని ఎనేబల్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







