టర్కీ దేశానికి కొత్త పేరు..
- June 03, 2022అంకారా: తమ దేశం పేరుపై టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్‌లో ఆ దేశాన్ని టర్కీ(Turkey) అని పిలుస్తారు. అయితే ఇక నుంచి తమ దేశాన్ని టర్కీయే(Türkiye) అని పిలువాలని ఆ దేశం ఐక్యరాజ్యసమితిని కోరింది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌కు తుర్కై విదేశాంగ మంత్రి కవసొగ్లూ లేఖ రాశారు.టర్కీ ప్రభుత్వం పంపిన లేఖను స్వాగతిస్తున్నట్లు యూఎన్ తెలిపింది. అయితే పేరు మార్పు ప్రక్రియ గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైంది. అధ్యక్షుడు రీసెప్ తయ్యప్ ఎర్డగాన్ నేతృత్వంలో ఆ ఉద్యమం సాగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. దేశ బ్రాండ్ వాల్యూను పెంచే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవసొగ్లూ తెలిపారు.యూఎన్‌కు లెటర్ అందిన రోజు నుంచే కొత్త పేరును అమలులోకి తీసుకువచ్చారు.టర్కిష్ ప్రజల సంస్కృతి, నాగరికత, విలువలకు కొత్త పేరు ప్రత్యామ్నాయంగా ప్రతిబింబిస్తుందని గతంలో అధ్యక్షుడు ఎర్డగోన్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు