టూరిస్ట్ గైడ్లకు శిక్షణ తప్పనిసరి.. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
- June 04, 2022
యూఏఈ: టూర్ గైడ్ల వృత్తి నియంత్రణపై షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఎమిరేట్‌లోని టూర్ గైడ్లను పర్యవేక్షించడానికి, శిక్షణ, రిఫ్రెషింగ్ కోర్సులు అందించడానికి షార్జా కామర్స్ అండ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ (SCTDA)కి పూర్తి బాధ్యతలను అప్పగించింది. నిబంధనలు ఉల్లంఘించే గైడ్ ల అనుమతిని సస్పెండ్ చేయడానికి లేదా రద్దు చేయడానికి కూడా SCTDAకి హక్కును కట్టబెట్టింది. సవరించిన నిర్ణయం ప్రకారం.. అనుమతి లేని టూర్ గైడ్లను నియమించకుండా ఏ సంస్థనైనా ఆదేశించే అధికారం SCTDAకు ఉంది. టూర్ గైడ్ అనుమతిని పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. కనీసం అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడాలి. అథారిటీ నిర్దేశించిన శిక్షణా కార్యక్రమాలలో ఉత్తీర్ణులై ఉండాలి. టూర్ గైడ్ లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. SCTDA ప్రతి సంవత్సరం అందించే రిఫ్రెషర్ కోర్సులో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్స్ పునరుద్ధరించబడుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







