నిఖిల్ ప్యాన్ ఇండియా ప్లానింగ్ మావులుగా లేదుగా.!
- June 06, 2022
‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన నటుడు నిఖిల్ సిద్దార్ధ్. తర్వాత సోలో హీరోగా విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే ఈ యంగ్ హీరో తాజాగా మరో ప్రయోగానికి తెర లేపాడు. అదే ‘స్పై’ మూవీ.
టైటిల్లోనే వుంది కదా. స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా నుంచి లెటెస్టుగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్లో వుంది ఆ గ్లింప్స్. చేతిలో ట్రాన్స్‌మీటర్ పట్టుకుని మంచు కొండల్లో నడుస్తున్న హీరో, ఆయుధాలతో నిండిన ఒక సీక్రెట్ ప్లేస్‌ని కనుగొనడాన్ని ఈ గ్లింప్స్‌లో చూపించారు. వెరీ స్టైలిష్ అండ్ డేషింగ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు నిఖిల్ ఈ గ్లింప్స్‌లో.
టెక్నికల్‌గా చాలా చాలా రిచ్‌గా కట్ చేశారీ టీజర్ బిట్‌ని. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయ్. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ కైకో నకహరా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు వుండబోతున్నాయట.
మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్యా మీనన్, నిఖిల్ సిద్ధార్ధ్‌కి జంటగా నటిస్తోంది ఈ సినిమాలో. అలాగే, అల్లరి నరేష్ సోదరుడు, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.
తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ‘స్పై’ సినిమాతో నిఖిల్ సిద్ధార్ధ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవడం ఖాయమన్న మాట.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







