ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి

- June 06, 2022 , by Maagulf
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 110 పైగాటీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలనుఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా న్యూజీలాండ్  నుండి శ్రీలత మగతల వ్యాఖ్యాతగా 5 జూన్ 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో నంది పురస్కార గ్రహిత, కలైమామణి, గానసామ్రాట్ డా మనో (నాగూరుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు కోసం 28 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయం అని తెలిపారు. మా చిన్ననాటి రోజుల్లో వారి పాటలు విని పెరిగానని, ముఖ్యంగా ఘంటసాల గారు  పాడిన శివశంకరి, రసికరాజా, మది శారదాదేవి వంటి పాటలు అనేక కచేరీలలో పాడి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించానని చెపుతూ, అలాగే తనలాంటి వారు ఒక మంచి గాయకుడుగా ఎదుగుదలకు కారణము అయ్యిందని చెపుతూ, ఘంటసాల గొప్ప గాయకుడు అనిచెపుతూ ఈ కాలం గాయకులు అందరు వారిని ఆదర్శంగా తీసుకొని గొప్ప కళాకారులుగా ఎదగాలని ఆకాంక్షను వెలుబుచ్చారు. వారు పాడిన కొన్ని అలనాటి పాటలను పల్లవి పాడి టీవీ ప్రేక్షకులను అలరించారు. మీరందరూ  భారతరత్న పురస్కారానికి చేస్తున్నచిరు ప్రయత్నం అతి త్వరలోనే సాకారం కావాలని  ఆకాంక్షిస్తూ  తన పూర్తి మద్దతునితెలియచేసారు. 

ముఖ్య ఉపన్యాసకులు శైలేష్ లఖ్టాకియా (ఐ.ఎఫ్.యస్) ఇండియన్ కౌన్సులేట్ లో విశిష్ట సేవలనందించి రిటైర్మెంటు తరువాత న్యూఢిల్లీ లో నివసిస్తున్నారు. వారు ఈ కార్యక్రమములో పాల్గొని ఘంటసాల గారు స్వయంగా హిందీలో పాడి స్వరకల్పన చేసిన ఝండ ఊంచా రహే హమారా పాటను గుర్తు చేసారు.   

చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాలకుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారు మాట్లాడుతు ఇప్పటిదాక ఈ కార్యక్రమలో పాల్గొన్న 28 దేశాల సేవలను కొనియాడారు. 

శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు ప్రసాద్ రాణి, ఆస్ట్రేలియా సిడ్నీ నుండి తబలా విధ్వాంసులు, ఆదిశేషు కోట,  తెలుగు భాగవత ప్రచారసమితి అధ్యక్షులు, భాస్కర్ వులపల్లి, న్యూజిలాండ్ నుండి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, అనిత మొగిలిచెర్ల, భారతదేశం నుండి జి వి రమణ (RACCA, రాజమహేంద్రవరం) గాయకుడు, నిర్వాహకుడు, శివరామి రెడ్డి వంగ అడ్మిన్, మా నాన్నాఘంటసాల, తెలంగాణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ,  ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్రప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరు ముక్తకంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతరసంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  

ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 113 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు.

ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు.

దయచేసి ఈ  క్రింద లంకె ను నొక్కి సంతకాల సేకరణకు మీ మద్దతు తెలియ చేయండి.

https://www.change.org/BharatRatnaForGhantasalaGaru

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com