పవన్ హీరోగా ‘వకీల్ సాబ్’ సీక్వెల్ వస్తోందిగా.!

- June 06, 2022 , by Maagulf
పవన్ హీరోగా ‘వకీల్ సాబ్’ సీక్వెల్ వస్తోందిగా.!

హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ సినిమాకి తెలుగు రీమేక్‌గా రూపొందిన సినిమానే ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా కరోనా ప్యాండమిక్ టైమ్‌లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సినిమాలు మానేస్తానని చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు కూడా.

అయితే, ఇంత భారీ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఏమైపోయినట్లు.? మళ్లీ కనిపించలేదెందుకు.? అప్పటికే వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి వుంది. ‘ఐకాన్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు ఆ సినిమాకి. సినిమా రాలేదు కానీ, బన్నీ మాత్రం ఐకాన్ స్టార్ అయిపోయాడు.

సరే, ఆ సంగతి అటుంచితే, వేణు శ్రీరామ్ ప్రస్తుతం ఏం చేస్తున్నట్లు.? కట్ చేస్తే, ‘వకీల్ సాబ్’ సినిమా టైమ్‌లోనే ఆ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని అనుకున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ స్టోరీ లైన్ కూడా అనుకున్నారట. ఆ లైన్‌ని డెవలప్ చేసే పనిలోనే వేణు శ్రీరామ్ వున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ రానుందట. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా పవన్ కల్యాణ్‌కి వుపయోగపడేలా ఈ సినిమా కంటెంట్ వుండబోతోందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. పవన్ ఇప్పుడున్న పరిస్థితులో సినిమాకి 120 రోజుల కన్నా ఎక్కువ డేట్లు కేటాయించలేకపోతున్నారు. సో, వీలైనంత తక్కువ టైమ్‌లోనే ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అదీ సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com