సౌదీ వర్చువల్ హాస్పిటల్‌తో బహ్రెయిన్ ఒప్పందం!
- June 25, 2022
సౌదీ: బహ్రెయిన్‌ని సౌదీ వర్చువల్ హాస్పిటల్‌కి నెట్వర్క్ ద్వారా లింక్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాల ఉంటాయని సౌదీ, బహ్రెయిన్ ఆరోగ్య మంత్రులు చెప్పారు. ఈ విషయంలో ఒక ఒప్పందం కుదిరితే.. సౌదీ ఆసుపత్రితో అనుసంధానించబడిన మొదటి దేశంగా బహ్రెయిన్ నిలుస్తుందన్నారు. ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న తన బహ్రెయిన్ కౌంటర్ డాక్టర్ జలీలా అల్-సయ్యద్‌ను కలిశారు. ఈ సమావేశంలో వారు దేశాల మధ్య ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. వైద్య పరిశోధన, కొత్తగా వస్తున్న వ్యాధులు, వ్యాక్సిన్ అనంతర సమస్యలను పర్యవేక్షించడం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం వంటి రంగాలపై వారు చర్చించారు. అల్-జలాజెల్ వర్చువల్ హాస్పిటల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. అనంతరం బహ్రెయిన్ మంత్రి వర్చువల్ హెల్త్ హాస్పిటల్లో పర్యటించి, ఆసుపత్రి అందిస్తున్న సేవలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







