అందాల రాక్షసి ‘బర్త్ ‌డే’ పార్టీకి డేట్ ఫిక్స్ చేసేశారహో.!

- June 25, 2022 , by Maagulf
అందాల రాక్షసి ‘బర్త్ ‌డే’ పార్టీకి డేట్ ఫిక్స్ చేసేశారహో.!

అదేంటీ.! బర్త్ డే పార్టీకి డేట్ ఫిక్స్ చేయడమేంటీ.? బర్త్ డే డేట్ ఆల్రెడీ ఫిక్స్ అవుతుంది కదా.. అనుకుంటారా.? అయితే మీకీ ముచ్చట తెలియాల్సిందే. ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి వుంది. ఆమె తాజాగా ‘బర్త్‌డే పార్టీ’ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశామంటూ తాజాగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. జూలై 8న ‘బర్త్ డే పార్టీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదీ అసలు సంగతి. సరే, ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషిస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీ అనేయొచ్చు.

లావణ్య‌తో పాటు, కమెడియన్ సత్య, వెన్నెల కిశోర్, గెటప్ శీను తదితరులు ఇతర లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. బర్త్ ‌డే పార్టీ మోడ్‌లో ఈ సినిమా కథ మొత్తం వుండబోతోంది. అలాగే, మన ఇండియాలో బ్యాన్ అయిన గన్ కల్చర్ కథాంశంగా ఈ సినిమా రూపొందింది. అయితే అదంతా ఫన్ మోడ్ అనుకోండి.

రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ ఆఫ్ ఫన్ మోడ్‌లోనే సినిమా ట్రైలర్ కట్ చేశారు. అందర్నీ బాగా ఆకట్టుకుంది ఆ ట్రైలర్. అన్నట్లు ఇది కూడా ప్యాన్ ఇండిమా మూవీనేనండోయ్. రితీష్ రానా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీస్ వాళ్లు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించారు. సో, లావణ్య బర్థ్ డే పార్టీ’ అంత ఆషా మాషీ కాదండోయ్. ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే. కేవలం ధియేటర్లలో మాత్రమే సుమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com