ప్రభాస్ కోసం విలన్‌గా మారతానంటోన్న హీరో.!

- June 25, 2022 , by Maagulf
ప్రభాస్ కోసం విలన్‌గా మారతానంటోన్న హీరో.!

ప్రభాస్, గోపీచంద్ కలిసి ‘వర్షం’ సినిమాలో నటించారు. హీరోగా ప్రబాస్‌కీ, విలన్‌గా గోపీచంద్‌కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత గోపీచంద్ హీరోగా సెటిలైపోయాడు. విలన్‌గా నటించే సాహసం చేయలేదు వేరే హీరోకి.

‘గౌతమ్ నందా’ సినిమాలో గోపీచంద్ సెల్ఫ్ విలనిజం చూపించిన సంగతి తెలిసిందే. అదేంనండీ గోపీచంద్ డబుల్ రోల్‌లో రూపొందిన ఈ సినిమాలో తనకు తానే విలన్‌గా నటించాడు గోపీచంద్. కాగా, చాలా కాలంగా గోపీచంద్ విలనిజంపై కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ మధ్య హీరోగా కలిసి రావడం లేదు గోపీచంద్‌కి.

దాంతో రూటు మార్చేసి, విలన్‌గా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడట గోపీచంద్.. అంటూ ప్రచారం జరిగింది. కానీ, అందుకు సిట్యువేషన్స్ కరెక్టుగా సెట్ కాలేదేమో బహుశా. ఆ తరహా ప్రాజెక్టులేమీ గోపీచంద్ చెంతకు రాలేదట.

తాజాగా గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే, ప్రబాస్‌తో తన విలనిజం గురించిన ముచ్చట్లు కూడా సోదిలోకి వచ్చాయి.

‘ప్రభాస్, నేనూ మంచి స్నేహితులం. అప్పుడప్పుడూ ఫ్రెండ్లీగా కలుస్తూనే వుంటాం. ఆ స్నేహంతోనే, ప్రబాస్ అడిగితే, ఆయన కోసం మళ్లీ విలన్‌గా మారడానికి నేను సిద్ధం..’ అంటూ గోపీచంద్ సెలవిచ్చారు. ప్రస్తుతం ప్రబాస్ ప్యాన్ ఇండియా రేంజ్ హీరో. ఏమో, భవిష్యత్తులో ప్రభాస్, గోపీచంద్ కాంబినేషన్ మళ్లీ సెట్టవుతుందేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com