ప్రయాణాలకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దు
- June 25, 2022
దుబాయ్: గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షలు విధించిన కారణంగా పర్యాటకుల సందడి లేక వెలవెలబోయిన దుబాయ్ ఈ సంవత్సరం వేసవి కాలంలో వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా తమ ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దు అని దుబాయ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలీసులు ఈ విజ్ఞప్తి చేయడానికి ముఖ్య కారణం ఒక ప్రముఖ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తన ప్రయాణ వివరాలు పోస్ట్ చేసిన వెంటనే అతను/ఆమెకు సంబంధించిన వస్తువులను దొంగతనం చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు.
దుబాయ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయ్యద్ అల్ హాజ్రి మాట్లాడుతూ" విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ యొక్క బోర్డింగ్ పాస్ మరియు ఇతరత్రా సమాచారాన్ని సరదాగా సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వాటిని ఆధారంగా చేసుకుని వారి గుర్తింపును దొంగిలించేందుకు కొందరు నేరస్తులు ప్రయత్నిస్తున్నారు " అని పేర్కొన్నారు.
హాజ్రీ కొనసాగిస్తూ తమ వ్యక్తిగత మరియు ప్రయాణాలకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ద్వారా ఆయా మాధ్యమాల్లో తమను అనుసరించేవారు పెరుగుతారని భావిస్తున్న వారికి నేను చెప్పేది ఏమిటంటే, ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లుకు మీరే స్వయంగా మిమల్ని దొచుకోమని ఆహ్వానిస్తున్నారు. దీని వల్ల మీరు దీర్ఘ కాలంలో చాలా నష్టాలు చవిచూస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







