‘మేజర్’ ఓటీటీ దూకుడు మామూలుగా లేదుగా.!
- July 08, 2022
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆర్ధిక రాజధాని ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఉగ్ర దాడుల్లో హతమైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి దేశభక్తి కాన్సెప్ట్ ఆపాదించుకుని, ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ కావడంతో, కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆదరణ దక్కించుకుంది.
కాగా, జూలై 3 నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ధియేటర్లలో అడవి శేష్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా గుర్తింపు దక్కించుకున్న ‘మేజర్’ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఓటీటీ హిందీ వెర్షన్ ట్రెండింగ్‌లో టాప్ 1 పొజిషన్‌లో కొనసాగుతుండగా, తెలుగు వెర్షన్ టాప్ 2 స్థానాన్ని దక్కించుకుని రికార్డులు కొల్లగొడుతోంది. ఇండియాతో పాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లోనూ ‘మేజర్’ రికార్డులు కొల్టగొట్టేస్తున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్







