మెగా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారా.?

- July 08, 2022 , by Maagulf
మెగా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారా.?

కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో ప్రేక్షకులు ధియేటర్లకు గుడ్ బై చెప్పేసి, ఓటీటీకి అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా, స్టార్ హీరో సినిమా అయినా టేక్ లైట్.. అనే స్థాయికి సగటు ప్రేక్షకుడి ఒపీనియన్ పడిపోయింది. 

నెల రోజులు వెయిట్ చేస్తే చాలు.. ఎంత గొప్ప సినిమా అయినా ఓటీటీలో రావల్సిందే.. అనే ఆలోచనలో ప్రేక్షకుడున్నాడు. దాంతో ధియేటర్లలో సినిమా చూసేందుకు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. దాంతో, స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సైతం ఓటీటీ కంటెంట్‌పై ఫోకస్ ఛేంజ్ చేసుకున్నారు. 

అలా ఓటీటీలో మంచి కంటెంట్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే సమంత, కాజల్ అగర్వాల్ తదితర స్టార్ ముద్దుగుమ్మలు ఓటీటీలో సందడి చేశారు. చేస్తున్నారు. ఇప్పటికే ఓ మోస్తరు హీరోలు ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల ఫోకస్ కూడా ఓటీటీ వైపు మళ్లిన సంగతి తెలిసిందే.

ఆల్రెడీ వెంకటేష్ ఓ ఓటీటీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానాతో కలిసి వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కూడా త్వరలో ఓటీటీ తెరపై సందడి చేయబోతున్నారట. ఈ మధ్యనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ, మెగాస్టార్ చిరంజీవితో డీల్ సెట్ చేసుకుందట. 

చిరంజీవి తన స్టార్‌డమ్‌కి సెట్ అయ్యే కథతో వస్తే, ఖచ్చితంగా కలిసి పని చేద్దాం.. అని సదరు ఓటీటీ సంస్థకు మాటిచ్చాడట. మెగా మాటంటే మామూలు విషయం కాదు. సో, సదరు ఓటీటీ పుణ్యమా అని,  త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుడు తన నట్టింటికి తీసుకొచ్చేసుకోనున్నాడన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com